News April 5, 2025
జగిత్యాల నుంచి TPCC సేవాదళ్ సెక్రటరీగా ముకేశ్ ఖన్నా

జగిత్యాల పట్టణానికి చెందిన బోగోజీ ముకేశ్ ఖన్నాను TPCC సేవాదళ్ సెక్రటరీగా నియమించారు. 2007 నుంచి కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUIలో ఉన్న ముకేశ్‌కు జగిత్యాల నుంచి రాష్ట్ర స్థాయి పదవి లభించడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన నియామకం పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.
Similar News
News April 5, 2025
సన్నబియ్యం కేంద్రానివే: కిషన్ రెడ్డి

TG: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘6KGల బియ్యంలో 5KGలు PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకోసం కిలో బియ్యానికి రూ.37.52ల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. అంటే ఐదుగురున్న కుటుంబానికి నెలకు రూ.938ల సబ్సిడీని అందిస్తోంది. ఈ పథకం కింద 2కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది’ అని Xలో రాసుకొచ్చారు.
News April 5, 2025
బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా వేముల ప్రమాణస్వీకారం

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడిగా వేముల నరేందర్‌రావు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల వరకు జిల్లా అంతటా పార్టీని బలోపేతం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిలీప్ ఆచారి, సుధాకర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
News April 5, 2025
కన్నులపండుగగా సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం

శ్రీరామనవమికి భద్రాద్రి రామయ్య దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో జరుగుతున్న తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం శనివారం కన్నుల పండువగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాశి సీతమ్మకు జరిగే కళ్యాణ మహోత్సవానికి ఒక రోజు ముందు జరిగే ఎదుర్కోలు వేడుక ఆద్యంతం వైభవోపేతంగా జరుగుతోంది.