News December 18, 2025

జగిత్యాల: నూతన పాలకవర్గాలపై గంపెడాశలు

image

పల్లెలే దేశానికి పట్టు కొమ్మాలంటారు. అలాంటి పల్లెల్లో సర్పంచులు లేక దాదాపు 2 ఏళ్లు గడిచింది. దీంతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోక కుంటుపడ్డాయి. ఇక తాజాగా జరిగిన ఎన్నికలతో పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటు కానుండగా, గెలిచినవారంతా ఈనెల 22న ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. వారు ఏ మేరకు గ్రామాలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తారో వేచి చూడాలి మరి.

Similar News

News December 19, 2025

TG SET హాల్ టికెట్లు విడుదల

image

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG SET 2025) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ <>http://www.telanganaset.org/<<>> నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24 వరకు 3 రోజుల పాటు రెండు షిఫ్టులలో పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు అర్హత పొందాలంటే టీజీ సెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

News December 19, 2025

WGL: పెద్ద పంచాయతీలు హస్తానివే..!

image

మేజర్ పంచాయతీలు అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని 33 మండల కేంద్రాల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు గెలవగా, 17 చోట్ల BRS బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు. అనూహ్యంగా BJP సైతం HNK జిల్లాలోని కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో హవా చాటింది. జనగామ(M) వెంకిర్యాల, దామెర(M) కోగిల్వాయి, ఐనవోలు(M) పంతినిని తన ఖాతాలోకి వేసుకుంది. ఇదిలా ఉంటే స్వతంత్రులు సైతం ఏడు పెద్ద పంచాయతీల్లో పాగా వేశారు.

News December 19, 2025

నల్గొండ : గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

నల్గొండ మండలంలోని చర్లపల్లి గురుకుల కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మెడ, తల భాగాల్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను తోటి విద్యార్థినులు గమనించి వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.