News December 31, 2025

జగిత్యాల: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరం జిల్లాలోని ప్రతి ఇంట్లో ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజల భాగస్వామ్యం, సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు. రాబోయే ఏడాదిలో జగిత్యాల జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆయన అధికారులకు సూచించారు.

Similar News

News January 1, 2026

సింహాచలం ప్రసాదంలో నత్త ఘటన.. విచారణ ముమ్మరం

image

సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త కనిపించిందన్న ఘటనపై దేవాదాయ శాఖ విచారణ ముమ్మరం చేసింది. ఈవో సుజాత, ఏఈఓ రమణమూర్తిలను సీపీ విచారించి, నివేదికతో పాటు సీసీ ఫుటేజీ సమర్పించాలని ఆదేశించారు. ప్రసాదం తయారీలో నత్త పడే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తూ, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియో ప్రచారం చేసిన జంటపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 30 ఏళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఏఈఓ రమణమూర్తి పేర్కొన్నారు.

News January 1, 2026

రాష్ట్రపతి చేతుల మీదుగా ఎంపీ హరీశ్‌కు పురస్కారం

image

రాష్ట్రపతి భవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ ప్రామాణిక పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగి అందుకున్నారు. రాబోయే దశాబ్దంలో దేశ జీడీపీ, ఉపాధి రంగాల్లో కృత్రిమ మేధస్సు (AI) కీలక పాత్ర పోషిస్తుందని హరీశ్ పేర్కొన్నారు. యువత AI నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

News January 1, 2026

సంతానోత్పత్తి తగ్గి కొరియాలో స్కూళ్ల మూత

image

పిల్లలు రాక ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతుండడం సాధారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇది షరా మామూలైంది. అయితే మన దగ్గర సదుపాయాలు, టీచర్ల లేమి, ప్రైవేటు స్కూళ్ల పోటీ కారణమైతే అక్కడ సంతానోత్పత్తి తగ్గడం దీనికి కారణం. దక్షిణ కొరియాలో గత కొన్నేళ్లలో 4008 GOVT స్కూళ్లు మూతపడ్డాయి. వీటిలో 3674 స్కూళ్లు ఎలిమెంటరీయే. ఈ దేశంలో సంతానోత్పత్తి రేటు 0.7కు పడిపోయింది. ఇతర దేశాలతో పోలిస్తే ప్రపంచంలో ఇదే అత్యల్పం.