News December 2, 2025

జగిత్యాల: నేటి నుంచి దివ్యాంగులకు ఆటల పోటీలు

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 2 నుంచి జగిత్యాల జిల్లాకేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో దివ్యాంగులకు ఆటలపోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే దివ్యాంగులు 18 సంవత్సరాలు నిండి 54 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపారు. పోటీలో పాల్గొనే వారు తమ ఆధార్ కార్డు, సదరం వెంట తీసుకుని రావాలి.

Similar News

News April 5, 2026

ఖమ్మం: అధికారులకు ‘వెలుగుమట్ల’ సెగ..!

image

వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కోర్టు ఆదేశాలు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య అధికారులు చిక్కుకుపోయారు. ఇటీవల కూల్చివేతల రోజే RDO బదిలీ కావడం, తాజాగా అర్బన్‌ MRO బదిలీతో వ్యవహారం ముదిరింది. బాధితులకు ఇళ్లు కట్టిస్తామని ప్రకటించినా, అర్హుల జాబితాలో అక్రమాలపై విమర్శలొస్తున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక ఓ ఉన్నతాధికారి సైతం బదిలీ కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News April 5, 2026

ప్రకాశం: జూన్‌లో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుకు ఆదేశం

image

ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణ వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. జూన్ నెలాఖరులో పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అందుబాటులో ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

News April 5, 2026

గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠంపై కన్ను? వారసుల కోసం రాజకీయాలు!

image

WGL మేయర్ స్థానం జనరల్ కావడంతో ఆ సీటపై అన్ని రాజకీయ పార్టీలు కన్ను వేశాయి. వచ్చే మే 7న పాలకవర్గం పదవి కాలం ముగుస్తుంది. దీంతో గ్రేటర్ పరిధిలో ఉన్న MLAలు, మాజీ MLAలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు మేయర్ సీటును తమ వారసులకు దక్కించుకోవడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న 66 వార్డుల్లో 34 వార్డుల్లో పట్టు సాధిస్తే మేయర్ కావొచ్చు. ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి.