News March 1, 2026
జగిత్యాల: నేడే ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్‌లో అందించే ఐదు నెలల ఉచిత శిక్షణ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ నరేశ్ తెలిపారు. ఈరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్, ఆధార్ కార్డు, బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో హాజరుకావాలని సూచించారు.
Similar News
News March 1, 2026
కృష్ణా: డిగ్రీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో జనవరి 2026లో నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 12లోపు ఒక్కో పేపరుకు రూ.800 ఫీజు ఆన్‌లైన్‌లో http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం సూచించింది.
News March 1, 2026
KNR: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

HYD బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 తరగతిలో ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు తెలిపారు. దీంతో పాటు పలు తరగతులలో ఖాళీగా ఉన్న 21 సీట్లను సైతం భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 1, 2026
వేట్లపాలెం ప్రమాదంపై డిప్యూటీ సీఎం, హోంమంత్రి సమీక్ష

వేట్లపాలెం బాణసంచా పేలుడుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు మురళీ మోహన్, నిరంజన్ రెడ్డి వారిని కలిసి వివరాలను వివరించారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ నేత మాధవ్ కూడా పాల్గొన్న ఈ భేటీలో బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారు.


