News February 27, 2025

జగిత్యాల: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పట్టభద్రులు 35,281, ఉఫాధ్యాయులు 1,769 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం 51, ఉపాధ్యాయుల కోసం 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ స్థానంలో 15 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

Similar News

News February 27, 2025

సూర్యాపేట: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

image

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో నల్గొండ రీజియన్‌లోని సూర్యాపేట, కోదాడ డిపోల ప్రయాణికులకు చిల్లర బాధలు తప్పనున్నాయి.

News February 27, 2025

నిర్మల్ జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో ఉదయం 10 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 1,206 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 7.04 శాతంగా పోలింగ్ నమోదయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 201 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 10.22 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు.

News February 27, 2025

జగిత్యాల:10AM వరకు పోలింగ్ శాతం నమోదు వివరాలు

image

జగిత్యాల జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ శాతం గురువారం ఉదయం 10 గంటల వరకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీకి 9.67 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ శాతం 6.43% నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తంగా రెండు కలిపి 6.58% పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!