News February 21, 2025
జగిత్యాల: నేరం చేస్తే శిక్ష తప్పదు: ఎస్పీ

జిల్లాలోని గడిచిన రెండు నెలల్లో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 14 మందికి జైలు శిక్షలు పడే విధంగా కృషి చేసిన పీపీలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించి ప్రశాంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతటి వారైనా నేరం చేస్తే శిక్ష తప్పదని అన్నారు. నేరస్థులకు శిక్ష పడేలా చేయడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకరావచ్చన్నారు.
Similar News
News December 1, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
News December 1, 2025
VZM: ‘ఫిర్యాదుదారుల సంతృప్తి స్థాయి పెరగాలి’

విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన PGRS వినతులపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సమీక్షించారు. ఫిర్యాదుదారుల్లో సంతృప్తి స్థాయి పెరిగేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆడిట్ అధికారులందరూ PGRSకు విధిగా హాజరుకావాలన్నారు. రెవిన్యూ శాఖకు సంబంధించి మ్యూటేషన్లపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని మండల ప్రత్యేకాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
News December 1, 2025
విశాఖ జిల్లాలోని స్కూళ్లలో పిల్లలకు ఉదయం స్నాక్స్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో మూడు రోజుల మార్నింగ్ న్యూట్రిషన్ అందించేందుకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అక్షయపాత్ర సహకారంతో కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. తొలి విడతగా 178 పాఠశాలల్లో ప్రారంభించి, త్వరలో అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. ఉదయం అల్పాహారం లేక తరగతులకు వచ్చే పిల్లలకు చిరుతిండ్లు వంటివి అందించనున్నారు.


