News October 27, 2025
జగిత్యాల: పంట కొనుగోళ్లపై సందేహాలున్నాయా..?

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతునేస్తం కార్యక్రమాన్ని రేపు ఉ.10 నుంచి 11 గం.ల వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై మార్కెటింగ్, మార్క్ ఫెడ్, ECCI అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లా రైతులు తమ సమీప రైతువేదికల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని పంట కొనుగోళ్లపై ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు.
Similar News
News October 27, 2025
తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు

AP: తుఫానుపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, 25 కేజీల బియ్యం సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని ఆదేశించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూడాలని, ప్రజలెవరూ బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపారు.
News October 27, 2025
నిర్మల్: యూ డైస్ వివరాలను నమోదు చేయాలి: డీఈవో

ప్రతీ పాఠశాల యూ డైస్‌లో వివరాలను ఖచ్చితంగా, సరియైన విధంగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. నిర్మల్ కొండాపూర్‌లో గల ఓ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. యూ డైస్‌లో గల మూడు రకాల మాడ్యూల్‌లలో పాఠశాల వివరాలను, పాఠశాలలో ఉన్న సౌకర్యాలను, విద్యార్థుల సంబంధించిన వివరాలను ఉపాధ్యాయుల వివరాలను పరిశీలించాలన్నారు.
News October 27, 2025
ధాన్యం తడవడంపై నల్గొండ కలెక్టర్ ఆగ్రహం

వర్షాకాల ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. కనగల్ మండలం పగిడిమర్రిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సోమవారం తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడవటంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహణలో లోపాల కారణంగా, సంబంధిత ఏపీఎం, సెంటర్ ఇన్‌ఛార్జిలకు ఆమె తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


