News August 21, 2025
జగిత్యాల పట్టణ మౌలిక వసతులపై ఎమ్మెల్యే సమీక్ష

జగిత్యాల పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులపై MLA సంజయ్ కుమార్ తన నివాసంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. CM మంజూరు చేసిన రూ.50 కోట్లు, విలీనం చేసిన ప్రాంతాలకు కేటాయించిన రూ.20 కోట్ల ప్రతిపాదనలపై చర్చించి సూచనలు చేశారు. గంజ్ నాల, ధర్మపురి రోడ్డు, చింతకుంట డ్రైనేజీల నిర్మాణం, పట్టణ పార్కుల్లో క్రీడా స్థలాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు అవసరమని, మంజూరైన నిధులు సక్రమంగా వినియోగించాలన్నారు.
Similar News
News August 21, 2025
గుంటూరు జిల్లా TODAY TOP NEWS

☞ కొండవీటి వాగు డ్రోన్ విజువల్స్.
☞ గంజాయి కేసులో ఇద్దరు గుంటూరు వ్యక్తులు అరెస్ట్.
☞ తెనాలి: యువకుడిని బెదిరించి దారి దోపిడీ.
☞ గంజాయి కేసులో 14 మంది అరెస్ట్.
☞ తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే పోలీసులకే భయం.
☞ మంగళగిరి: మంగళగిరిలో పొల్యూషన్ బోర్డు తనిఖీలు.
☞ పొన్నూరు: పోలీసుల విచారణకు హాజరైన అంబటి మురళీ.
☞ డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టాలి: DMHO.
News August 21, 2025
వివాదానికి శుభం కార్డు.. రేపటి నుంచి షూటింగ్‌లు షురూ!

ప్రభుత్వ జోక్యంతో టాలీవుడ్ <<17429585>>ప్రొడ్యూసర్లు-ఫెడరేషన్<<>> మధ్య వివాదం సద్దుమణిగింది. దీంతో 18 రోజుల విరామం తర్వాత రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. కండీషన్లు, డిమాండ్లపై కాసేపట్లో ప్రకటన విడుదల కానుంది. ప్రభుత్వ జోక్యంతో లేబర్ కమిషన్ రంగంలోకి దిగి చర్చలు జరిపింది.
News August 21, 2025
రేపు ఫలితాలు విడుదల

AP: రేపు DSC మెరిట్ <<17459141>>లిస్ట్ <<>>విడుదల చేయనున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. DSC సైటుతో పాటు జిల్లా విద్యాధికారి సైటులోనూ ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో వివిధ కేటగిరీల పోస్టుల కాల్ లెటర్ పొందవచ్చని సూచించారు. లిస్టులో ఉన్న వారంతా ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన 3 సెట్ల జిరాక్సులు, 5 పాస్ పోర్టు ఫొటోలతో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలిపారు.