News December 21, 2025

జగిత్యాల: పదవి సరే… పైసలేవీ..!

image

ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగగా నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఈ మేరకు జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు, 3536 వార్డు స్థానాల్లో సోమవారం పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసి గెలుపొందిన నూతన సర్పంచులను పదవులు వరించిన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పదవి ఉన్న పైసలు లేక తిప్పలు తప్పేలా లేవు. కేవలం కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే ఆశలు ఉన్నాయి.

Similar News

News December 25, 2025

NCERT 173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>NCERT <<>>173 గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 27 నుంచి జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Lib.Sc, B.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ncert.nic.in

News December 25, 2025

తిరుమల క్షేత్రపాలుడిగా పరమశివుడు

image

తిరుమల కేవలం వైష్ణవ క్షేత్రమే కాదు. శైవ సామరస్యానికి వేదిక కూడా! శ్రీవారు ఇక్కడ కొలువై ఉంటే, ఆయనకు రక్షకుడిగా, క్షేత్రపాలుడిగా పరమశివుడు ‘రుద్రుడి’ రూపంలో కొలువై ఉంటారు. తిరుమల కొండపై ఉన్న ‘గోగర్భ తీర్థం’ వద్ద శివుడు క్షేత్రపాలకత్వ బాధ్యతలు నిర్వహిస్తారట. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు క్షేత్రపాలుడిని కూడా స్మరించుకోవడం ఆచారంగా వస్తోంది. హరిహరుల మధ్య భేదం లేదని ఈ క్షేత్రం చాటిచెబుతోంది.

News December 25, 2025

విశాఖ స్టీల్ ప్లాంటులో మూడో విడత VRS

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 3వ విడత VRSకు యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. 2027 JAN 1 తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 15ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని 45ఏళ్లు దాటిన ఉద్యోగులను అర్హులుగా పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో తొలిసారి 1,146, రెండోసారి 487 మంది VRSకు అంగీకరించారు. ఈసారి 570 మందికి వీఆర్ఎస్ ఇవ్వాలనే లక్ష్యంతో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.