News November 29, 2025
జగిత్యాల: పారదర్శక పంచాయతీ ఎన్నికలకు దిశానిర్దేశం

గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ సూచించారు. కలెక్టరేట్‌లో ఆర్వోలు, ఏఆర్వోలకు ఫేజ్-3 శిక్షణ ఇచ్చారు. నామినేషన్ దశ కీలకమైందని, ప్రతి వివరాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించాలని తెలిపారు. సర్పంచ్‌కు 8, వార్డు సభ్యుడికి 6 కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలని, ఒరిజినల్ పత్రాలనే వినియోగించాలని అన్నారు.
Similar News
News December 3, 2025
చలికాలంలో చర్మం బాగుండాలంటే?

ఉష్ణోగ్రతలు పడిపోయే కొద్దీ వాతావరణంలో తేమ తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడిబారడం, దురద లాంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇలాకాకుండా ఉండాలంటే సెరమైడ్స్, షియా బటర్, హైలురోనిక్ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్ వాడాలి. పెదాలకీ విటమిన్ ఇ, షియాబటర్ ఉన్న లిప్‌బామ్ మంచిది. ఇవి చర్మానికి తేమని, ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. ఈ కాలంలో హెవీ క్రీములు కాకుండా మీ చర్మానికి సరిపడేవి రాసుకోవాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.
News December 3, 2025
అల్లూరి: పేరెంట్స్ మీట్‌కు రూ.54.92లక్షల విడుదల

అల్లూరి జిల్లాలో ఈనెల 5న జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌కు ప్రభుత్వం రూ.54.92 లక్షలు విడుదల చేసిందని DEO బ్రహ్మాజీరావు బుధవారం తెలిపారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని టీచర్స్&పేరెంట్స్ సహకారంతో నిర్వహించాలన్నారు. ప్రతీ పేరెంట్‌కు ఆహ్వానం అందించాలన్నారు. 2,913 ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.


