News April 19, 2025
జగిత్యాల: పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టండి: ఎస్పీ

గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులల్లో ఈతకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. శనివారం జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. సరదా కోసం ఈతకు వెళ్తే కొందరు ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు జరిగాయని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఈత నేర్చుకునే పిల్లలు తల్లిదండ్రులతో వెళ్ళాలన్నారు.
Similar News
News February 5, 2026
బాపట్ల: ‘ప్రతి మహిళా విద్యావంతులుగా మారాలి’

మహిళలకు చదువు ఎంతో అవసరమని, ప్రతి మహిళ విద్యావంతులుగా మారాలని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ అన్నారు. గురువారం ఉదయం బాపట్ల మండలం ఈతేరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళలు చదువుకోవడం వల్ల కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
News February 5, 2026
NZB: మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కసరత్తు..!

నిజామాబాద్ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో దానిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి 19వ డివిజన్లో పోటీ చేస్తున్న కాటిపల్లి శమంత, బీజేపీ నుండి 6వ వార్డులో పోటీ చేస్తున్న గోపిడి స్రవంతి రెడ్డి మేయర్ పదవీని ఆశిస్తున్నట్లు సమాచారం.
News February 5, 2026
మెదక్: RS ప్రవీణ్ కన్న ఊసరవెల్లి నయం: ఎంపీ

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బ్లూ కండువా ఉన్నప్పుడు ఫొన్ ట్యాపింగ్ చేశారంటూ కేసీఆర్, కేటీఆర్‌పై ఆరోపణలు చేసి, పింక్ కండువా వేసుకున్నాక ట్యాపింగ్ లేదంటూ మాట మార్చారని మండిపడ్డారు. BSPలో ఉన్నప్పుడు కేసీఆర్ అక్రమాలు అన్నవాడు, ఇప్పుడు పక్కన చేరగానే సత్యహరిశ్చంద్రుడిలా పొగడ్తలంటున్నారని, ట్యాపింగ్ నిజం కాకపోతే అప్పట్లో ఎందుకు ఆరోపించారని ప్రశ్నించారు.


