News October 9, 2025
జగిత్యాల: పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి: అడిషనల్ కలెక్టర్

జగిత్యాల పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, కేసుల సంఖ్య తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గత నెలలో జరిగిన నేరాలపై బుధవారం చర్చించారు. పెండింగ్ కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్‌ఓపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులను ఛేదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, ఎన్నికల నియమావళిపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.
Similar News
News October 9, 2025
NGKL: మద్యం దుకాణాలకు 41 దరఖాస్తులు

నాగర్ కర్నూల్ జిల్లాలోని 67 మధ్య షాపులకు గాను బుధవారం వరకు 41 దరఖాస్తులు వచ్చాయి. కాగా బుధవారం ఒక్కరోజే 17 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 26, కొల్లాపూర్ పరిధిలో 2, కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 7, తెలకపల్లి పరిధిలో 6 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
News October 9, 2025
VZM: జిల్లాలో నేడు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఛైర్మెన్ సిహెచ్.విజయ ప్రతాప్ రెడ్డి విజయనగరం జిల్లాలో గురువారం పర్యటించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జి.మురళీనాథ్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఛైర్‌పర్సన్ జిల్లాకు వస్తారని, ముందుగా బొబ్బిలిలో క్షేత్రస్థాయిలో పర్యటించి, అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
News October 9, 2025
ADB: ఈ కార్యాలయాలు మారాయి.. గమనించండి

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం పాక్షికంగా కూలిపోవడంతో పలు కార్యాలయాలు తాత్కాలిక మార్పులు జరిగాయని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పెన్ గంగ భవన్‌కు, కలెక్టరేట్ విభాగాలు AO నుంచి H వరకు పెన్ గంగ భవన్‌కు, తహశీల్దార్ (అర్బన్) జెడ్పీ ఆఫీస్‌కు, డీఎస్ఓ ఆఫీస్ రోడ్లు భవనాల (R&B) శాఖ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.