News December 13, 2025

జగిత్యాల: పోలింగ్‌ కేంద్రాలకు చేరిన ఎన్నికల సిబ్బంది

image

జగిత్యాల జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది, సామగ్రి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. జగిత్యాల, జగిత్యాల రూరల్, సారంగాపూర్, మల్యాల, బీర్పూర్, రాయికల్, కొడిమ్యాల మండలాల్లోని 144 సర్పంచ్‌, 1276 వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1276 పోలింగ్‌ కేంద్రాలకు 1531 పీఓలు, 2036 ఏపీఓలు, రిటర్నింగ్‌ అధికారులు వాహనాల్లో చేరుకున్నారు.

Similar News

News December 14, 2025

నా జీతాన్ని పేదలకు ఖర్చు చేయండి: నవీన్ పట్నాయక్

image

ఒడిశాలో MLAల జీతాలను <<18524281>>భారీగా<<>> పెంచిన నేపథ్యంలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వేతనం, అలవెన్సులను పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని సీఎం మోహన్ చరణ్‌కు లేఖ రాశారు. ‘25 ఏళ్లుగా ఒడిశా ప్రజల ప్రేమ, ఆప్యాయత, మద్దతు నాకు లభించింది. నా పూర్వీకుల ఆస్తిని కూడా 2015లోనే దానం చేశా. అదే స్ఫూర్తితో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా నాకు లభించే జీతభత్యాలను వదులుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News December 14, 2025

కొండ చుట్టూ లోల్లులే!

image

ఒక లొల్లి పోగానే మరో లోల్లితో మంత్రి కొండా సురేఖ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నటుడు నాగార్జునతో గొడవ ముగిసిన తరుణంలో, KTR పరువు నష్టం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. DCC అధ్యక్షుల నియామక విషయంలో ఇంట్లోనే భేదాభిప్రాయాలతో వరంగల్‌కు దూరంగా ఉంటుండగా, ముఖ్య అనుచరుడు నవీన్ రాజ్ రూపంలో మరో వివాదం ఆమెను చుట్టుముట్టింది. నమ్మిన రమేశ్ వైరి వర్గంలోకి మారడం, తోటి మంత్రులతో విభేదాలూ చర్చనీయాంశమయ్యాయి.

News December 14, 2025

WNP: సమస్యలుంటే ఉన్నతాధికారులకు తెలపండి: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైతే, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ ఎలాంటి అలసత్వం లేకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.