News April 5, 2025
జగిత్యాల :పోలీస్ ప్రధాన కార్యాలయంలో డా.జాగ్జీవన్ జయంతి

జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జాగ్జీవన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారన్నారు. భారత సమాజ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారన్నారు.
Similar News
News April 6, 2025
మా మీద ఎలాంటి ఒత్తిడీ లేదు: SRH కోచ్

ఆడిన ప్రతి మ్యాచ్లోనూ సన్రైజర్స్ 300 కొడుతుందన్న అంచనాలు ఉంటున్నాయి. అవే ఆ జట్టు కొంపముంచాయా? SRH అసిస్టెంట్ కోచ్ సైమన్ హెల్మట్ ఆ విషయంపై స్పందించారు. ‘అంచనాల ఒత్తిడి మాపై ఏమాత్రం లేదు. ఇదంతా జట్టుకు బయట జరుగుతున్న విషయం మాత్రమే. అంతర్గతంగా జట్టుపై అది ఎలాంటి ప్రభావమూ చూపించదు’ అని పేర్కొన్నారు. 300 పరుగులు అటుంచి ఈ సీజన్లో మ్యాచులు గెలిచేందుకు కూడా సన్రైజర్స్ ఇబ్బంది పడుతుండటం గమనార్హం.
News April 6, 2025
నారాయణపేట: ఆరుగురిపై కేసు నమోదు

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల శివారులో కొంత మంది జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్, ఉట్కూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.7,700 నగదు, 6 సెల్ఫోన్లు, 3 బైక్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించామని ఎస్ఐ కృష్ణంరాజు శనివారం తెలిపారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News April 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.