News August 26, 2025
జగిత్యాల: ‘ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలి’

జగిత్యాల జిల్లా ఆర్మ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్ గా వెంకట్ రావు పదోన్నతి పొందారు. నేడు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ హెడ్ కానిస్టేబుల్‌కు పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేశారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంపొందించాలన్నారు.
Similar News
News August 27, 2025
నేడు విశాఖ-కిరండూల్ ఎక్సప్రెస్ రద్దు

కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈనెల 27న (బుధవారం) రాత్రి అరకు మీదుగా విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే విశాఖ-కిరండూల్ (18515) ఎక్సప్రెస్, అలాగే కిరండూల్ నుంచి విశాఖ బయలుదేరే (18516) ఎక్సప్రెస్ రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు విశాఖ-కిరండూల్(58501) పాసింజర్ అరకులో నిలిపేశారు. తిరుగు పయనం అరకు నుంచే విశాఖ బయలుదేరుతుందని వెల్లడించారు.
News August 27, 2025
ఇరాక్‌లో జగిత్యాల జిల్లా వాసుల వేడుకలు

ఇరాక్ దేశంలోని రాయల్ దులీప్ హోటల్‌లో ఉంటున్న దాదాపు 150 మంది జగిత్యాల జిల్లా వాసులు వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మండపాన్ని అలంకరించి గణపతి ప్రతిమను ప్రతిష్టించారు. గణనాథుడికి తొమ్మిది రోజులపాటు నిత్యపూజలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజుల రాజు, రంజిత్, నితిన్, శ్రీకాంత్, రోహిత్, హరీష్, సాయి, సందీప్ పాల్గొన్నారు.
News August 27, 2025
SRSP UPDATE: 25 గేట్లు ఓపెన్.. లక్ష క్యూసెక్కులు విడుదల

SRSPకి వరద నీరు పోటెత్తడంతో మొత్తం 25 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు 8 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. 25 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లోగా 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా 1,30,392 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.