News January 20, 2026

జగిత్యాల: ‘ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించాలి’

image

జగిత్యాల జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో అవసరమైన పరికరాలు, అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని చెప్పారు. క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో అత్యవసర వైద్య సేవలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News April 14, 2026

3 నెలలు తట్టుకోగలరా?.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

image

హార్ముజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేయడంపై ఇరాన్ దీటుగా స్పందించింది. తమకు ఇబ్బందేం లేదని, 90 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై చేయగలమని పేర్కొంది. ‘ఇరాన్‌ను దిగ్బంధిస్తానని ఆయన(ట్రంప్) బెదిరించాడు. 3 నెలలపాటు అమ్ముకోవడానికి సరిపడా చమురు నిల్వ మా ట్యాంకర్లలో ఉంది. మీరు, మీ మిత్రదేశాలు అన్ని రోజులు తట్టుకోగలరని మీకు నమ్మకముందా?’ అని బల్గేరియాలోని ఇరాన్ ఎంబసీ ప్రశ్నించింది.

News April 14, 2026

IPL: CSKతో మ్యాచ్.. KKR బోణీ కొడుతుందా?

image

IPLలో భాగంగా ఇవాళ చెన్నై, కోల్‌కతా తలపడనున్నాయి. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, ఆడిన 3 మ్యాచుల్లోనూ KKR ఓడింది. దీంతో ఇవాళ్టి మ్యాచులో గెలవాలని భావిస్తోంది. మరోవైపు హ్యాట్రిక్ ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో విజయం సాధించి చెన్నై టచ్‌లోకి వచ్చింది. అదే ఊపుతో విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News April 14, 2026

దేశంలోనే తొలి ‘క్వాంటం’ కేంద్రం.. అమరావతిలో నేడే ప్రారంభం

image

AP: దేశంలోనే తొలి క్వాంటం కేంద్రం రాష్ట్రంలో ఏర్పాటు కాబోతోంది. అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్(AQRS)ను CM చంద్రబాబు ఇవాళ 2PMకు ప్రారంభించనున్నారు. అమరావతిలోని SRM వర్సిటీలో ఓ ఫెసిలిటీ(1 S), గన్నవరంలోని మేథ టవర్స్‌‌లో మరొకటి(1 Q) ఆవిష్కృతం కానున్నాయి. దీంతో <<19081669>>క్వాంటం కంప్యూటర్<<>> హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే సామర్థ్యం క్వాంటం వ్యాలీకి రానుంది.