News March 7, 2026
జగిత్యాల: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి’

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలుపై కరీంనగర్ కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాలో కార్యక్రమం అమలుకు తీసుకుంటున్న చర్యలు, కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
Similar News
News March 9, 2026
ఆసిఫాబాద్‌లో దివ్యాంగులకు సదరం శిబిరాలు

ఆసిఫాబాద్ జిల్లాలో దివ్యాంగుల కోసం మార్చి నెలలో సదరం వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెల్లడించింది. మార్చి 11న కంటి చూపు, 12న మానసిక వైకల్యం, 18న రక్తస్రావ రుగ్మతలు (సికిల్ సెల్, తలసేమియా,హిమోఫిలియా), 25న మూగ/చెవిటి, 27న ఎముకల వైకల్యాలపై పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని శిబిరాలు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతాయి.
News March 9, 2026
హాని కలగకుండా చూడాలి: జనగామ కలెక్టర్

ఈ-వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. జనగామ మండలం శామీర్‌పేట్ గ్రామ పరిధిలో గల డీఆర్సీ కేంద్రాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి వారు మాట్లాడారు. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్‌లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సక్రమంగా సేకరించాలని, ఇతర వ్యర్థాలను వర్గీకరించి పునర్వినియోగించాలన్నారు.
News March 9, 2026
జైనూర్: ఢిల్లీ వేడుకలకు సర్పంచ్‌కు ఆహ్వానం

జైనూర్ మండలం మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభకు ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆహ్వానం అందింది. అహర్నిశలు కృషి చేస్తూ మార్లవాయిని ఆదర్శ జీపీ తీర్చిదిద్దారు. జీపీ అభివృద్ధికి ఐఎస్‌వో సర్టిఫికెట్‌తో పాటు రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చాయి. దీంతో ఆమెకు ఈ గౌరవం లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు.


