News March 17, 2025

జగిత్యాల: ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం: ఎస్పీ

image

జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు లేఖలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News March 17, 2025

నంద్యాల జిల్లా టుడే టాప్ న్యూస్

image

➤ నంద్యాల జిల్లాలో మొదలైన పదో తరగతి పరీక్షలు
➤ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి
➤ కలెక్టర్ కార్యాలయంలో 209 అర్జీల స్వీకరణ
➤అహోబిలం బ్రహ్మోత్సవాలకు భారీ ఆదాయం
➤ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఏఎస్పీ జావలి
➤RMP వేధింపులు… మహిళ ఆత్మహత్యాయత్నం

News March 17, 2025

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ

image

TG: ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు లేఖ రాశారు. అఖిల పక్ష నేతలతో కలిసి ఆయనతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతుతో పాటు అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా చొరవ చూపాలని కోరేందుకు రేవంత్ పీఎంకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

News March 17, 2025

మంచిర్యాల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు

image

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నస్పూర్‌లో పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనతో పాటు మంచిర్యాలలో జరుగుతున్న దాడులు, అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు సోమవారం HYDలో డీజీపీ జితేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఘటనలకు కారకులపై కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.

error: Content is protected !!