News December 23, 2025
జగిత్యాల: ప్రభుత్వం ఆధ్వర్యంలో మొబైల్ ఎక్స్‌రే సేవలు

మొబైల్ ఎక్స్‌రే మిషన్ ద్వారా క్షయ వ్యాధి గుర్తింపు సులభమవుతుందని జిల్లా వైద్యాధికారి ఆకుల శ్రీనివాస్ తెలిపారు. టీబీ ముక్త భారత్ అభియాన్‌లో భాగంగా జగిత్యాల ఖిలాగడ్డ అర్బన్ ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక టీబీ క్యాంపు నిర్వహించారు. మొబైల్ ఎక్స్‌రే ద్వారా అక్కడికక్కడే పరీక్షలు చేసి బాధితులను గుర్తించి మందులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 29, 2025
నేటి ముఖ్యాంశాలు

* కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: PM మోదీ
* పేదల హక్కులపై BJP దాడి: ఖర్గే
* రేపు అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్
* నీటిపారుదల శాఖపై CM రేవంత్ సమీక్ష.. అసెంబ్లీలో లేవనెత్తే ప్రశ్నలపై వ్యూహం సిద్ధం
* అయోధ్యను దర్శించుకున్న CM CBN.. శ్రీరాముడి విలువలు అందరికీ ఆదర్శమని ట్వీట్
* శ్రీలంక ఉమెన్స్‌తో 4వ టీ20లో భారత్ విజయం
* భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రూ.300
News December 29, 2025
నెహ్రూ లేఖలను తిరిగి ఇచ్చేయండి: కేంద్రమంత్రి

జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన కీలక లేఖలు, పత్రాలు దేశ వారసత్వ సంపద అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. వీటిని వెంటనే ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ’కి తిరిగి అప్పగించాలని సోనియా గాంధీని కోరారు. అవి కుటుంబ ఆస్తి కాదని.. దేశ చరిత్రను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 2008లో దాదాపు 26,000 పత్రాలను తీసుకెళ్లారని.. గతంలో పలుమార్లు కోరినా తిరిగి ఇవ్వలేదని గుర్తు చేశారు.
News December 29, 2025
ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: టీటీడీ

ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ఈ నెల 30న జరగబోయే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆదివారం TTD ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చంటి బిడ్డల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనట్లు TTD AE అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆరోజు భక్తులకు ప్రసాదం, అన్న ప్రసాదం అందుబాటులో ఉంటుందని TTD DEO ప్రశాంతి తెలియజేశారు.


