News January 26, 2026

జగిత్యాల: ప్రశంసా పత్రం అందుకున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ

image

జగిత్యాలలో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎన్. శ్రీనివాస్ సోమవారం కలెక్టర్ సత్యప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధులలో మెరుగైన సేవలు అందించినందుకు గాను కలెక్టర్ ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు వైద్య అధికారులు తదితరులు అభినందించారు.

Similar News

News February 20, 2026

NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో నవంబర్ 2025లో నిర్వహించిన L.L.B. III/III 5వ & V/V 9వ, ఎం.ఈడీ కోర్సు 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News February 20, 2026

హన్మక్కపల్లిలో చిరుత బీభత్సం

image

వేములవాడ మున్సిపల్ పరిధి హన్మక్కపల్లిలో చిరుతపులి కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి రైతు రోమాల భూమయ్యకు చెందిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. పాదముద్రలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఇది చిరుత పనేనని నిర్ధారించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘటనాస్థలికి చేరుకున్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు బాధిత రైతును పరామర్శించారు.

News February 20, 2026

ఎనిమిదేళ్లకే ఇంత టాలెంటా!

image

రణవీర్ సచ్‌దేవా(8) అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 4 ఏళ్లకే నాసా వెబ్‌సైట్‌లో చోటు సంపాదించిన ఈ బుడతడు.. 5 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన ‘యాపిల్ ప్రోగ్రామర్‌’గా గుర్తింపు పొందాడు. 6 ఏళ్లకే ‘టెడెక్స్’ స్పీకర్‌గా రికార్డు సృష్టించాడు. పర్యావరణంపై తనకున్న అవగాహనతో ‘గ్రీన్ యోధా’గా నిలిచాడు. తాజాగా ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ సమ్మిట్’లో కీనోట్ స్పీకర్‌గా ప్రపంచ నాయకుల దృష్టిని ఆకర్షించాడు.