News November 1, 2025

జగిత్యాల: ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్..!

image

జగిత్యాలలోని బాలికల జూనియర్ కళాశాలలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలక మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని 2,105 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా, పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ఇదిలా ఉండగా షేర్ హోల్డర్ల లిస్టులో తమ పేరు ఉందని, అయినప్పటికీ ఓటర్ లిస్టులో పేరు రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Similar News

News November 2, 2025

మంచిర్యాల: రూ.1.39 కోట్లు కాజేసిన నిందితుడి అరెస్టు

image

తప్పుడు లెక్కలతో వరి ధాన్యాన్ని చూపించి సివిల్ సప్లై నిధులు రూ.1.39 కోట్లు కాజేసిన కేసులో 3వ నిందితుడు సాయికుమార్‌ను అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు జైపూర్ ఎస్సై శ్రీధర్ చెప్పారు. ఈ కేసులో మిగతా ముద్దాయిలు 12 మంది పరారీలో ఉన్నారన్నారు. వారిని పట్టుకోవడం కోసం ఎస్సై ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News November 2, 2025

MHBD: 22 ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల వివరాలు!

image

22 ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల వివరాలు. MHBD MPPS జమాండ్లపల్లి, ఈదులపుసపల్లి, గడ్డి గూడెం, దంతాలపల్లి-గున్నేపల్లి, లక్ష్మిపురం, నెల్లికుదురు-మునిగలవీడు, గూడూరు-అయోధ్యపురం, లక్ష్మిపురం, తొర్రూర్-వెలికట్ట, వెంకటాపురం, అమ్మాపురం, సీరోల్-కాంపల్లి, తాళ్లసంకీస, నర్సింహులపేట-బోడ్కాతండా, గార్ల-చినకిష్టాపురం, కురవి-గుండ్రతిమడుగు, హరిదాస్ తాండ, కేసముద్రం-కల్వల, బోడగుట్ట తాండ, చిన్నగూడూర్ జయ్యారంలో ఉన్నాయి.

News November 2, 2025

మెదక్: 3న విద్యుత్ సమస్యలు చెప్పుకోండి: ఎస్ఈ

image

మెదక్​ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్సూమర్స్​ డే) నిర్వహిస్తున్నట్లు ఎస్​ఈ నారాయణ నాయక్​ తెలిపారు. మెదక్​ జిల్లాలో రైతులు, గృహావసర విద్యుత్ వినియోగదారులకు ధీర్ఘకాలికంగా విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా, మీటర్లు, అధిక బిల్లులు వచ్చినా, రైతులకు ట్రాన్స్​ఫార్మర్లకు కానీ, విద్యుత్ వైర్లకు సంబంధించి నేరుగా వచ్చి చెప్పాలని కోరారు.