News April 7, 2025
జగిత్యాల: ప్రారంభమైన 10వ తరగతి స్పాట్ వాల్యూషన్

జగిత్యాల పట్టణంలోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో సోమవారం నుంచి పదవ తరగతి పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు తెలుగు పేపర్ వాల్యూయేషన్ కోసం 70 మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ప్రతి రోజూ సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉంటుంది.
Similar News
News April 11, 2025
వరంగల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం

వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, హార్వెస్టింగ్ యజమానులతో అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద దేవి పాల్గొని 2024-2025 రబీ(యాసంగి) సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వ్యవసాయ అధికారి ఉన్నారు.
News April 11, 2025
దేవరకద్ర: తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతన్నలు

దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు నిమిత్తం మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. కాగా గురవారం కురిసిన వర్షంతో ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
News April 11, 2025
ములుగు: ‘మావో’లకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం!

ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలవడం చర్చనీయాంశంగా మారింది. ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ల వద్ద పోస్టర్లు వెలిశాయి. అడవుల్లో మందు పాతరలు పెట్టి ఆదివాసీలను మావోయిస్టులు అడ్డుకుంటున్నాని, మమ్మల్ని బతకనివ్వరా.? మా ప్రాంతాలపై మీ పెత్తనం ఏంటని పోస్టర్లలో ప్రశ్నించారు.