News January 27, 2025
జగిత్యాల: ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు

జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనెల 29న జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ తెలిపారు. SSC, ఇంటర్ చదివినవారు అర్హులన్నారు. వేతనం రూ.16 వేల నుంచి రూ.25వేల వరకు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. ఎంపికైన వారు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
Similar News
News September 15, 2025
KNR: రాజీవ్ యువ వికాసం.. దసరాకైనా అందేనా..?

రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి పొందవచ్చని భావించిన ఉమ్మడి KNR జిల్లా నిరుద్యోగుల ఆశలు ఆవిరవుతున్నాయి. జూన్ 2న రూ.50వేల నుంచి రూ.లక్షలోపు దరఖాస్తు చేసుకున్న అర్హులకు మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించి చివరి నిమిషంలో నిలిపేసింది. AUG 15న వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే ఎదురైంది. ఈ దసరాకైనా వస్తాయని ఆశతో ఎదురుచూస్తోంది. ఉమ్మడి KNR వ్యాప్తంగా 1,71,116 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు.
News September 15, 2025
HYD: నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష

నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ సర్కార్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
News September 15, 2025
లోక్‌సభలో 9 చర్చల్లో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ

లోక్‌సభలో(2024-25) ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఇందులో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ లోక్‌సభలో మొత్తంగా 61 ప్రశ్నలు అడిగారు. 9 చర్చల్లో పాల్గొన్నారు. 88.24 హాజరు శాతం కనబర్చారు.