News October 5, 2025

జగిత్యాల: బతుకమ్మ పండగలో కత్తులతో దాడి

image

రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్‌లో బతుకమ్మ వేడుకల వేళ ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసుకున్న ఘటనలో బోదాసు సతీష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడి వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 5, 2025

కాంగ్రెస్ షేక్‌పేట్ ఇన్‌ఛార్జ్‌గా అందె మోహన్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని షేక్‌పేట ఉపఎన్నికల ఇన్‌ఛార్జ్ అందె మోహన్ అన్నారు. ఈ ఎన్నికలో భాగంగా షేక్‌పేట కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అధిష్ఠానం నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన భుజస్కందాలపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.

News October 5, 2025

మహిళల్లో గుండెపోటు.. కారణాలివే!

image

ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల పురుషులతో పోల్చితే మహిళల్లో గుండెపోటు మరణాలు తక్కువ. అయితే ఇటీవల మహిళల్లోనూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయి. వీటికి అధిక బరువు, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, పొగ తాగడం, రుతుక్రమం ఆగడానికి మాత్రల వాడకం వంటివి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. 35ఏళ్లు పైబడిన మహిళలు కొన్ని కచ్చితమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News October 5, 2025

ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవాని భక్తుల రద్దీ

image

ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ దర్శనానికి ఆదివారం భవాని భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ఆలయ ఈవో శీనా నాయక్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు సజావుగా పూజల్లో పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా పూర్తి చేశామని, అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఈవో తెలిపారు.