News December 21, 2025

జగిత్యాల బల్దియాలో నక్షా సర్వే ప్రారంభం

image

జగిత్యాల బల్దియా పరిధిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్షా కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సర్వే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఇప్పటికే హెలికాప్టర్ ద్వారా పట్టణ ప్రధాన విభాగాలను సర్వే నిర్వహించారు. 200 ఇళ్లకు ఒక బ్లాక్ చొప్పున పట్టణాన్ని విభజించి, 14 బృందాల ద్వారా GPSతో కచ్చితత్వంతో కూడిన సర్వేను 6 నెలల్లో ఈ సర్వే పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

Similar News

News January 1, 2026

CBNపై KCR విమర్శలు.. TDP నేతల ఫైర్!

image

AP CM చంద్రబాబుపై BRS చీఫ్ KCR ఇటీవల చేసిన <<18634035>>వ్యాఖ్యలపై<<>> AP TDP నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. CBN స్టేట్స్‌మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తోందని, KCRకి నచ్చితే ఎంత? నచ్చకుంటే ఎంత? అంటూ మంత్రి ఆనం ఫైరయ్యారు. తమ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం బాధించిందన్నారు. అధికారం పోయినప్పుడల్లా CBNపై పడి ఏడవటం BRSకు అలవాటుగా మారిందని, కేసీఆర్ TDPలోనే పెరిగారని నిన్న MLA బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

News January 1, 2026

జగిత్యాల: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం ప్రారంభం

image

జగిత్యాల కలెక్టరేట్లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2026 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గోడపత్రిక ఆవిష్కరించి ప్రారంభించారు. రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు ట్రాఫిక్ నియమాల పాటన ఎంతో కీలకమని కలెక్టర్ అన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

News January 1, 2026

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ‘స్టార్ పెర్ఫార్మర్’ అవార్డులు

image

కలెక్టర్ సూచనల మేరకు PDPL ప్రభుత్వ ఆసుపత్రిలో జనవరి నెలకు ‘స్టార్ పెర్ఫార్మర్’ అవార్డులు ప్రదానం చేశారు. SNCU స్టాఫ్ నర్స్ శ్రీమతి ప్రశాంతి, క్యాజువాలిటీ స్టాఫ్ నర్స్ శ్రీమతి కళ్యాణిలను ఎంపిక చేశారు. SNCUలో మెరుగైన సేవలు, శిక్షణ అందించినందుకు ప్రశాంతిని, తోడులేని రోగులకు అంకిత సేవలందించినందుకు కళ్యాణిని సత్కరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.శ్రీధర్, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.