News February 28, 2026

జగిత్యాల బస్టాండ్‌లో తండ్రిని వదిలేసిన కొడుకు

image

ధర్మపురి పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తామని నమ్మించి కన్నతండ్రిని నడిరోడ్డుపై వదిలేశాడో కొడుకు. NZBకు చెందిన నారాయణను అతడి కొడుకు రమేశ్ జగిత్యాల బస్టాండ్‌లో విడిచిపెట్టి వెళ్లాడు. విషయం తెలుసుకున్న సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆయనకు అండగా నిలిచారు. బాధ్యులైన కొడుకు, కోడలికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారు పశ్చాత్తాపపడి, క్షమాపణలు కోరుతూ తండ్రిని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.

Similar News

News February 28, 2026

HYDలో అవినీతి ‘సిస్టమ్’ మారేనా?

image

GHMC పరిధిలో ACB దాడుల పరంపర కేవలం అధికారుల అవినీతిని బయటపెట్టడమే కాదు.. వ్యవస్థలో పాతుకుపోయిన ‘పర్సెంటేజీ’ల దందాను కూడా ఎండగడుతోంది. చట్టపరంగా చూస్తే 64 శాతం శిక్షా రేటు అనేది న్యాయస్థానాలు అవినీతిపై చూపిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. రాజకీయంగా కూడా ప్రభుత్వం 115 ప్రాసిక్యూషన్ శాంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అయితే, శిక్షలు ఒకవైపు.. వ్యవస్థ ప్రక్షాళన మరోవైపు సాగాల్సిందే!

News February 28, 2026

కార్డుదారుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: జేసీ

image

అనంతపురం జిల్లాలోని 6,74,333 రైస్ కార్డుదారులకు సరిపడా నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాలకు కేటాయించినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం & సాయంత్రం వేళల్లో రేషన్ షాపుల వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డీలర్లకు ఆయన సూచించారు. కార్డుదారులు తమకు దగ్గరలో ఉన్న ఏ చౌక ధరల దుకాణం వద్దనైనా నిత్యావసర సరుకులను పోర్టబిలిటీ ద్వారా పొందవచ్చన్నారు.

News February 28, 2026

MBNR: పీయూ.. ఎల్.ఎల్.బి పరీక్షలు!!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆకాడమిక్ భావనంలో L.L.M మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలను పరీక్షల నియంత్రణా అధికారి డాక్టర్ కె.ప్రవీణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాళవి, న్యాయ కళాశాల హెచ్ఓడీ డాక్టర్ వి.రాధాకృష్ణ, జి.రవి, జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.