News September 11, 2025
జగిత్యాల: బావిలో దూకి యువతి SUICIDE

జగిత్యాల అర్బన్(M) ధరూర్‌కు చెందిన బాలె లక్ష్మణ్-పద్మల కుమార్తె దివ్య(26) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన దివ్య ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, గ్రామ పొలిమేరలోని ఓ వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది. దివ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మానసికంగా కుంగిపోయిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
Similar News
News September 11, 2025
నా కుమారుడు YSR వారసుడే: షర్మిల

AP: YCP, జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘నా బిడ్డ రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే YCP ఇంతలా రియాక్ట్ అవుతోందంటే భయమా? నా కుమారుడికి రాజారెడ్డి అనే పేరు YSR పెట్టారు. ఎవరెన్ని వాగినా నా కొడుకు ఆయన వారసుడే. జగన్‌కు అసలు ఐడియాలజీ ఉందా? YSR బతికి ఉండి ఉంటే మీరు చేసిన పనికి తలదించుకునేవారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
News September 11, 2025
తెలుగు వారికి అండగా ఉంటాం: పల్లా శ్రీనివాస్

టీడీపీ ఎల్లప్పుడూ తెలుగు వారి యోగా క్షేమాలు చూస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం నారా లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేశాలని తెలిపారు. వారిని వైజాగ్ తీసుకొచ్చి వారి ప్రాంతాలకు పంపే ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రుషికేశ్‌లో వరదల సమయం, ఉక్రెయిన్ వార్ సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితిలో తెలుగు వారికి టీడీపీ అండగా ఉందని గుర్తు చేశారు.
News September 11, 2025
సిద్దిపేట: ALERT.. మూడు రోజులు భారీ వర్షాలు: సీపీ

మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరెంట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100 లేదా 87126 67100కు కాల్ చేయాలని సూచించారు.