News April 16, 2025

జగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కవితకు వినతి

image

జగిత్యాలకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా సహకరించాలని కోరుతూ బిసి సంక్షేమ సంఘం నాయకులు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, కొక్కు గంగాధర్, రామచంద్రం, రోజా, బొమ్మిడి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

నెల్లూరు: బంగారం కోసం హత్య

image

కొడవలూరు (M) కొత్త వంగల్లు గ్రామంలో ఈనెల 5న ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళ కోటేశ్వరమ్మ హత్యకు గురైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల వెల్లడించారు. కోటేశ్వరమ్మ ఇంటి వరండాలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన వేముల రంజిత్ కుమార్ రాయితో కొట్టి హత్య చేశాడు. ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు సరుడు ఎత్తుకెళ్లాడు. నిందితుడిని అరెస్ట్ చేసి సరుడు రికవరీ చేశారు.

News January 8, 2026

బాపట్లలో సాంప్రదాయ క్రీడా పోటీలు: కలెక్టర్

image

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వీసీఎండీ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 10న సాంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. బాపట్లలోని కేవీకే ఇండోర్ స్టేడియం, మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. సంప్రదాయాలను యువతకు తెలియజేసి మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం పెంపొందించడమే లక్ష్యమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.

News January 8, 2026

విజయ్ మూవీ వాయిదా.. టికెట్ మనీ రిఫండ్

image

తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించకపోవడంతో BMS టికెట్లు కొన్నవారికి రిఫండ్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడైన 4.5లక్షల టికెట్ల అమౌంట్‌ను తిరిగిచ్చేస్తోంది. దీంతోపాటు ప్రమోషన్లు, థియేటర్ల అగ్రిమెంట్ల రూపంలో మేకర్స్‌కు రూ.50కోట్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం.