News January 31, 2025
జగిత్యాల: బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే

జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు, 49 వ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పద్మశాలి సేవా సంఘం కార్యవర్గం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 1న మార్కండేయ జయంతి, ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు 49వ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 1 న టవర్ సర్కిల్ కొత్త బస్టాండ్ వరకు శోభయాత్ర ఉంటుందని సంఘం సభ్యులు పేర్కొన్నారు.
Similar News
News July 7, 2025
VR స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

నెల్లూరులోని VR మున్సిపల్ స్కూల్‌ను విద్యాశాఖ మంత్రి లోకేశ్ సోమవారం ప్రారంభించారు. ఎంతో చరిత్ర గల ఈ పాఠశాలను ఇటీవల మంత్రి నారాయణ పున:నిర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోకేశ్ పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ఈ పాఠశాల పున:నిర్మాణంలో నారాయణ కూతురు షరిణి కీలక పాత్ర పోషించారు. మంత్రి వెంట ఎంపీ వేమిరెడ్డి, కలెక్టర్ ఆనంద్ తదితరులు ఉన్నారు.
News July 7, 2025
NZB: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి

నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
News July 7, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹540 తగ్గి ₹98,290కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 తగ్గి ₹90,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.