News July 10, 2025

జగిత్యాల: ‘భవిష్యత్తులో లోవోల్టేజ్ సమస్య ఉండదు’

image

వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని జగిత్యాల SE బి.సుదర్శనం తెలిపారు. ఇందులో భాగంగా జగిత్యాల సర్కిల్ పరిధిలో కొత్తగా 9 సబ్ స్టేషన్‌లు మంజూరయ్యాయని, పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా అవసరం ఉన్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్‌లు నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఎటువంటి లోవోల్టేజ్ సమస్య ఉండదని తెలియజేశారు.

Similar News

News July 10, 2025

కళింగపట్నంలో నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మెాహన్

image

ఎత్తిపోతల పథకం పనులు త్వరగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానాయన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. వంశధార నదిలో నిర్మాణం జరుగుతున్న కళింగపట్నం వమరవెల్లి ఎత్తిపోతల పథకం పనులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకంతో ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు స్థితిగతులను ఎమ్మెల్యే గొండు శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు.

News July 10, 2025

నిజాంపేట్‌లో మరో కల్తీ కల్లు కేసు.. గాంధీకి తరలింపు

image

కల్తీ కల్లు తాగి నిజాంపేట్‌లోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న <<17017648>>వి.సుగుణమ్మ(58)<<>>ను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమెకు కూడా ఆ కళ్లు తాగడంతోనే వాంతులు విరోచనాలు కాగా కుటుంబ సభ్యులు నిజాంపేట్‌లోని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యచికిత్సల కోసం నేడు 108 సిబ్బంది సతీశ్ శ్రీనివాస్, సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News July 10, 2025

WGL: తీర్థ యాత్రలకు వెళ్లే వారికి ప్రత్యేక రైళ్లు

image

తీర్థ యాత్రలకు వేళ్లే వారికి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందని ఐఆర్సీటీసీ టూరిజం మేనేజర్ పీవీ.వెంకటేశ్ వెల్లడించారు. జూలై 19 నుంచి 26 వరకు ప్రత్యేక ప్యాకేజీతో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరుతో హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. యాత్రకి సంబధించిన అన్ని వివరాలను రైల్వే స్టేషన్లలోని ఐఆర్సీటీసీ సెంటర్లలో తెలుసుకోవచ్చని వరంగల్‌లో తెలిపారు.