News January 26, 2025
జగిత్యాల: మండలాల వారీగా 4 పథకాలు ప్రారంభించే గ్రామాలు

KRTL- సర్పరాజ్‌పల్లి, JGTL అర్బన్-హస్నాబాద్, JGTLరూరల్-కండ్లపల్లి, భీమారం-లింగంపేట, బీర్పూర్-చిత్రవేణిగూడెం, కొడిమ్యాల-రాంసాగర్, బుగ్గారం-బీర్‌సాని, మల్లాపూర్-కొత్తదాంరాజ్‌పల్లి, DRPR-కమలాపూర్, గొల్లపల్లి-అబ్బాపూర్, ఇబ్రహీంపట్నం-ఎర్రాపూర్, ఎండపల్లి-రాజారాంపల్లి, వెల్గటూర్-చెగ్యాం, పెగడపల్లి-ల్యాగలమర్రి, సారంగాపూర్-నాయకపుగూడెం, MTPL-విట్టంపేట్, రాయికల్-ధర్మాజిపేట, MDPL-గూండ్లపల్లి, మల్యాల-సర్వాపూర్
Similar News
News March 14, 2025
కామారెడ్డి: అక్కడ హోలీ పండగొస్తే గుండు ఎత్తాలి..!

హోలీ పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు. కాగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామంలో హోలీ పండుగను విభిన్నంగా నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రజలంతా ఒక చోట చేరి పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు నిర్వహిస్తారు. అనంతరం ఆనవాయితీగా వస్తున్న బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు. ఈసారి 95 కేజీల గుండును ఎత్తాలని పోటీ పెట్టగా యువకులు పాల్గొన్నారు.
News March 14, 2025
జన్మత: పౌరసత్వం అమలుపై సుప్రీంకోర్టుకు ట్రంప్ పాలకవర్గం

జన్మత: పౌరసత్వంపై ఆంక్షలను పరిమితంగా అమలు చేసేందుకు అనుమతించాలని డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం సుప్రీంకోర్టును కోరింది. దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్ ఆర్డర్‌ను అడ్డుకొనే అధికారం జిల్లా కోర్టులు, ఇండివిడ్యువల్ జడ్జిలకు లేదని తెలిపింది. న్యాయపోరాటం చేస్తున్నవారిని మినహాయించి ట్రంప్ ఆదేశాల అమలుకు అనుమతించాలని కోరింది. USలో అక్రమ నివాసితులకు పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వకుండా ట్రంప్ ఆదేశించడం తెలిసిందే.
News March 14, 2025
సిద్దిపేట: మార్చిలోనే మండుతున్న ఎండలు

సిద్దిపేట జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లాలో 36 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో రోడ్డు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే వచ్చే ఎప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఎండలో వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.