News February 24, 2025

జగిత్యాల: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

పట్టభద్రలు, టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Similar News

News November 6, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.

News November 6, 2025

HYD: మీర్జాగూడ యాక్సిడెంట్.. యువకుడి మెసేజ్ వైరల్!

image

ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘రూల్స్ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తాయి. మన ప్రాణాలు కాపాడేవి అవే. త్వరగా వెళ్లాలంటే ముందు జాగ్రత్తగా వెళ్లాలి. మీ ఇంటికెళ్తూ వేరే ఇళ్లల్లో కన్నీళ్లు మిగిల్చకండి’ అంటూ మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఇలా ప్లకార్డులు పట్టుకొని కనిపించాడు. మీర్జాగూడ ఘటన నేపథ్యంలో యువకుడు ఇచ్చిన మెసేజ్ వైరలవుతోంది.

News November 6, 2025

పిడుగురాళ్లలో వ్యక్తి దారుణ హత్య

image

పిడుగురాళ్ల లెనిన్ నగర్‌కు చెందిన కొమ్ము సంతోష్ రావును స్నేహితుడు సుభాని బండరాళ్లతో కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని సంతోష్ రావు బలవంతం చేయగా సుభాని నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగటంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.