News February 28, 2026

జగిత్యాల: మహిళకు పూర్తి రక్షణ కల్పించాం: డీడబ్ల్యూఓ

image

జగిత్యాల సఖి వన్ స్టాప్ సెంటర్ లో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా సంక్షేమ అధికారి (DWO) కె. రాజ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. సెంటర్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళకు పూర్తి రక్షణ కల్పించామని తెలిపారు. కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెప్పారు. ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Similar News

News February 28, 2026

చీపురుపల్లి: నువ్వు ఏమవుతావు? అని అడిగిన CM

image

సీఎం చంద్రబాబు శనివారం చీపురుపల్లిలో పర్యటించారు. చీపురుపల్లి CHCని పరిశీలించారు. అక్కడ ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ‘నువ్వు ఎం కావాలి అనుకుంటున్నావు’ అని ఓ విద్యార్థిని సీఎం అడగగా డాక్టర్ కావాలని అనుకుంటున్నానని చెప్పింది. అనంతరం విద్యార్థికి సీఎం ఆటోగ్రఫ్ ఇచ్చారు.

News February 28, 2026

ఖమ్మం: రూ.541 కోట్ల సైబర్ మోసంలో నిందితుడి అరెస్టు?

image

సత్తుపల్లి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన రూ.541 కోట్ల భారీ సైబర్‌ క్రైమ్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎర్రుపాలెం మండలానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో నిందితుల మూలాలు వెలికితీసేందుకు అధికారులు విచారణను వేగవంతం చేశారు.

News February 28, 2026

కల్వకుర్తి: రాజ్యసభ రేసులో వంశీచంద్ రెడ్డి..?

image

ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.