News July 7, 2025

జగిత్యాల: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

image

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది జగిత్యాల జిల్లాలోని షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 8712670783 నంబర్‌కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Similar News

News July 7, 2025

నేడు ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు కలెక్టర్

image

ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఈనెల 10న వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో పెట్టుకొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ట్రస్టును సందర్శించనున్నారు.

News July 7, 2025

కామారెడ్డి నుంచి పుణ్యక్షేత్రాల టూర్‌కు ప్రత్యేక బస్సులు

image

కామారెడ్డి డిపో నుంచి వారాంతాల్లో పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక డీలక్స్ బస్సు సేవలను TGSRTC ప్రారంభించింది. ఈ ప్రత్యేక బస్సులు కొమురవెల్లి, వరంగల్, చిలుకూరు బాలాజీ, దామగుండం, అనంతగిరి, కోటిపల్లి ప్రముఖ దైవక్షేత్రాలకు చేరవేస్తాయి. ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

News July 7, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 117 మంది ఎంపిక

image

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.