News September 17, 2025

జగిత్యాల: ‘మహిళల ఆరోగ్యం, కుటుంబ శక్తివంతం కోసం అభియాన్’

image

మహిళల ఆరోగ్యం బలోపేతం అయితేనే కుటుంబాలు శక్తివంతంగా ఉంటాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వస్థ నారి ససక్త పరివార్ అభియాన్ (హెల్తీ ఉమెన్ ఎంపవర్ ఫ్యామిలీ కాంపెయిన్)లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.

Similar News

News September 17, 2025

ఏలూరు: మోసపూరిత ఫోన్ కాల్స్‌పై DMHO హెచ్చరిక

image

ఏలూరు జిల్లాలో ఉద్యోగాలు, ప్రయోగశాలల అనుమతుల పేరుతో కొందరు మోసగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ పీజే అమృతం హెచ్చరించారు. ఈ ఫోన్ కాల్స్‌కు తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని, ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ సేవలు ఉచితంగా అందిస్తామని తెలిపారు.

News September 17, 2025

సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించిన చైనా ప్రతినిధి బృందం

image

అనంతపురం జిల్లా జంతలూరులోని AP సెంట్రల్ యూనివర్సిటీని న్యూఢిల్లీ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. కౌన్సిలర్ యాంగ్ షీయుహువా, జాంగ్ హైలిన్, సూ చెన్, ఫాంగ్ బిన్ CUAP ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరిని కలిశారు. విద్యలో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థులకు చైనా విద్యా వ్యవస్థ, ప్రభుత్వ ఉపకారవేతన పథకాల గురించి వివరించారు.

News September 17, 2025

జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన విశాఖ మేయర్

image

విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లతో కలిసి అధ్యయన యాత్రలో భాగంగా జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బుధవారం సందర్శించారు. జైపూర్ మేయర్ డా.సౌమ్య గుర్జర్‌ను శాలువ వేసి సత్కరించగా, ఆమె కూడా విశాఖ మేయర్‌కు మెమెంటో అందించారు. జైపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషన్ విధానాలు, టూరిజం చర్యలపై అధికారులు వివరాలు అందించారు.