News July 9, 2025
జగిత్యాల: ‘మహిళల ఆర్థిక ప్రగతి కోసం ఇందిరా మహిళా శక్తి సంబరాలు’

మహిళల ఆర్థిక ప్రగతి కోసం ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఓ రఘువరన్ అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల కిశోర బాలికలతో సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళా సంఘాలు సాధించిన విజయాలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఓదెల గంగాధర్ పాల్గొన్నారు.
Similar News
News July 10, 2025
నేడు భద్రాద్రి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30కు కొత్తగూడెం క్లబ్లో AITUC జిల్లా కార్యదర్శి, సీపీఎం నాయకుడు వీరన్న తెలంగాణ జాగృతిలో చేరే కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు పాల్వంచలో మహిళా నాయకురాలు సింధు తపస్వి నివాస సందర్శన, అనంతరం పాల్వంచ పెద్దమ్మ తల్లి దర్శనం ఉంటుంది. 3 గంటలకు తల్లిని కోల్పోయిన జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావును పరామర్శిస్తారు.
News July 10, 2025
జులై 10: చరిత్రలో ఈరోజు

1794: బ్రిటిష్ వారితో విజయనగర రాజుల ‘పద్మనాభ యుద్ధం’
1846:కోవెలకుంట్ల ఖజానాపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దాడి(ఫొటోలో)
1856: ప్రముఖ పరిశోధకుడు నికోలా టెస్లా జననం
1916: ఉమ్మడి ఏపీ మాజీ సభాపతి దివంగత కోన ప్రభాకరరావు జననం
1928: భారత తొలి మహిళా జడ్జి జస్టిస్ అమరేశ్వరి జననం
1945: సినీ నటుడు కోట శ్రీనివాసరావు జననం(ఫొటోలో)
1949: మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జననం(ఫొటోలో)
News July 10, 2025
టీబీ కేసుల గుర్తింపు కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం పీహెచ్‌సీని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ 100 రోజుల యాజిక్యంపై సమీక్షించారు. టీబీ కేసుల గుర్తింపు కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. డాక్టర్ ప్రణీత, ఫార్మాసిస్ట్ ప్రపుల్ల, ల్యాబ్ టెక్నీషియన్ మహేశ్ తదితరులున్నారు.