News February 23, 2026
జగిత్యాల: ‘మాదకద్రవ్యాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం’

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర చర్చ జరిగింది. విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా, యువతలో అవగాహన కార్యక్రమాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
Similar News
News February 25, 2026
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు.
జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన పైపులైన్లు, రహదారుల నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌలిక వసతులపై సమీక్షించారు. 6 మండలాలకు చెందిన 22 తండాల్లో తాగునీటి పైపులైన్ పనులకు అనుమతులు మంజూరు చేయాలన్నారు.
News February 25, 2026
ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు: హైకోర్టులో హరీశ్ తరఫు లాయర్

TG: కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని BRS చీఫ్ KCR, హరీశ్ రావు, స్మితా సబర్వాల్ వేసిన పిటిషన్లను హైకోర్టు ఇవాళ విచారించింది. PC ఘోష్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించిందని హరీశ్ తరఫు న్యాయవాది సుందరం కోర్టుకు నివేదించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం ఘోష్ నివేదిక చెల్లదని విన్నవించారు. కాగా విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. KCR తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నారు.
News February 25, 2026
రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: పొంగులేటి

రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న MRO, RDO కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 60 MRO, 5 RDO కార్యాలయాలకు, రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 కార్యాలయాలకు ఆధునిక భవనాలు నిర్మిస్తామన్నారు. ప్రజలకు పారదర్శకమైన, గౌరవప్రదమైన సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


