News October 10, 2025

జగిత్యాల: మానసిక ఆరోగ్యంపై విస్తృత అవగాహన

image

ప్రజల మానసిక ఆరోగ్యంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్చన తెలిపారు. జగిత్యాలలోని జె.ఎస్.రామ్ వెల్ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ అర్చన, వైద్య సిబ్బంది ప్రజలకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరించి అవగాహన కల్పించారు. వైద్యాధికారి కృష్ణకుమారితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 11, 2025

WGL: గాడి తప్పుతున్న ఖాకీలు..!

image

పోలీసు స్టేషన్లు MLAల అడ్డాగా మారిపోయాయా అంటే అవుననే తరహాలో ఘటనలు ఓరుగల్లులో చోటు చేసుకుంటున్నాయి. ఇక MLAల పేరు చెప్పి చోటా మోటా నాయకులు తమకు ఎదురు తిరిగిన వారిని పోలీసుల ఎదుటే కొట్టే స్థాయికి వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో నిన్నటి కేయూ పీఎస్ ఘటనే సాక్ష్యంగా నిలిచింది.పోలీసుల ఎదుటే బాధితుడిపై ఓ కాంగ్రెస్ నేత చేయి చేసుకోవడం కలకలం సృష్టించింది. సీసీ కెమెరాల్లో రికార్డైనా కేసు పెట్టనట్టు తెలుస్తోంది.

News October 11, 2025

జనగామ: నేడు కలెక్టరేట్లో పీఎండీడీకేవై పథకం ప్రారంభోత్సవం

image

జనగామ కలెక్టరేట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని శనివారం ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ప్రారంభ ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డిలు హాజరు కానున్నారు.

News October 11, 2025

భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

image

హీరోయిన్ దీపికా పదుకొణె భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. నిన్న వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. హెల్త్ మినిస్టర్ నడ్డాతో భేటీ అయిన ఫొటోలను దీపిక SMలో పోస్ట్ చేశారు. ఈ బాధ్యతలు తీసుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, టెలీ మానస్ వంటి స్కీమ్‌లను ప్రమోట్ చేయడంలో ఆమె కేంద్రంతో కలిసి పనిచేస్తారు.