News February 6, 2025
జగిత్యాల మార్కెట్లో నేటి ధరలు ఇలా

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేటి దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.4,050, గరిష్ఠ ధర రూ.6,418గా నమోదయ్యింది. అనుములు క్వింటాల్ కనిష్ఠ ధర రూ.4,095, గరిష్ఠ ధర రూ.7,955గా ఉంది. మక్కలు ధర రూ.2,222గా ఉంది. ధాన్యం (1010) ధర రూ.1,655గా ఉండగా, ధాన్యం (JSR) ధర రూ.2,653గా ఉంది. ఈ వివరాలను మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
Similar News
News December 15, 2025
జగిత్యాల: దంపతులు ఇద్దరికీ సమాన ఓట్లు

పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటలో పోచమ్మల ప్రవీణ్ (8వ వార్డు), మంజుల (10వ వార్డు) దంపతులు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98, 98 ఓట్లు సమానంగా పోల్ అయ్యాయి. కాగా, ప్రవీణ్ రామన్నపేట ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని BRS బలపరిచింది.
News December 15, 2025
జగిత్యాల: 3వ విడత ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

జగిత్యాల జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కోసం సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా 1306 మంది POలు, 1706 మంది APOలను కేటాయించారు. సిబ్బంది నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, అబ్జర్వర్ రమేష్‌తో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు.
News December 15, 2025
అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్ భేటీ

AP: విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. స్కిల్ అసెస్మెంటులో AI టెక్నాలజీ ఆధారిత పోర్టల్, పైలెట్ ప్రాజెక్టు అమలు గురించి వివరించారు. రాష్ట్ర నైపుణ్య గణనకు సహకరించాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో InnoXR యానిమేషన్, ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు తోడ్పడాలన్నారు. మరో కేంద్ర మంత్రి జయంత్ చౌదరితోనూ లోకేశ్ సమావేశమయ్యారు.


