News February 18, 2025
జగిత్యాల మార్కెట్లో నేటి ధరలు ఇలా

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు గరిష్ఠంగా రూ.7250 వరకు పలికాయి. కనిష్ఠ ధర రూ.4259గా ఉంది. అనుములు రూ.5000 నుంచి రూ. 7000 మధ్య పలికాయి. మక్కలు రూ.2121 నుంచి రూ.2266 మధ్య పలికాయి. వరి ధాన్యం (HMT) రూ.2175, వరి ధాన్యం(JSR) రూ.2645గా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
Similar News
News October 30, 2025
KNR: SU PG పరీక్ష ఫలితాలు విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధి PG లోని M.A, M.Com, M.Sc, M.S.W 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డా. డి. సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫలితాల కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.satavahana.ac.in ను సందర్శించాలని సూచించారు.
News October 30, 2025
VZM: ఉద్యోగులకు క్రీడా ఎంపిక పోటీలు వాయిదా

ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు జరగాల్సిన క్రీడా ఎంపిక పోటీలను మొంథా తుఫాన్ కారణంగా నిరవధికంగా వాయిదా వేశామని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు వాయిదా వేశామని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల తదుపరి తేదీలు వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News October 30, 2025
CBSE పరీక్షల తేదీలు విడుదల

వచ్చే ఏడాది జరిగే టెన్త్, 12వ తరగతి పరీక్షల ఫైనల్ డేట్ షీట్‌ను CBSE విడుదల చేసింది. రెండు క్లాసులకూ ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు మొదలవుతాయి. టెన్త్ విద్యార్థులకు మార్చి 10వ తేదీ వరకు, 12వ క్లాస్ స్టూడెంట్లకు ఏప్రిల్ 9 వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 10.30 గంటలకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ <


