News September 9, 2025
జగిత్యాల: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజీ

CPI మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శిగా JGTL(D)కు చెందిన తిప్పిరి తిరుపతి @ దేవుజీ నియామకమయ్యారు. సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్న దేవుజీని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2025 మే 21న ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో నంబాళ్ల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ చనిపోగా అప్పటినుంచి ఖాళీగా ఉంది.
Similar News
News September 9, 2025
యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: జాయింట్ కలెక్టర్

యూరియా ఎరుకుల కోసం రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. సామర్లకోట మండలం అచ్చంపేటలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్‌తో కలిసి ఎరువుల పరిస్థితి పరిశీలించారు. రైతులు మంచి ప్రయోజనాలు కలిగిన నానో యూరియాను వినియోగించాలని కోరారు. రైతులు సాగుచేసిన పంటల వివరాలు ధాన్యం కొనుగోళ్లపై కూడా మాట్లాడినట్లు మండల వ్యవసాయ అధికారి మురళీధర్ తెలిపారు.
News September 9, 2025
తాడేపల్లిలో రేపు జగన్ మీడియా సమావేశం

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించనున్నారు. రైతుల సమస్యలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, భూముల దోపిడీ వంటి అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
News September 9, 2025
విద్యార్థి సమస్యలపై సంఘాల ప్రతినిధులు స్పందిస్తూ ఉండాలి: కలెక్టర్

అమలాపురం కలెక్టరేట్ భవన్‌లో మంగళవారం ఆర్‌ఎస్‌యూ స్టూడెంట్ యూనియన్ పదవ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కంటేపల్లి నరేంద్ర ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఎప్పటికప్పుడు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థి సంఘాలు సమాజ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు.