News December 20, 2025
జగిత్యాల: ‘మాసోత్సవాలను జయప్రదం చేయాలి’

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జయప్రదం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 21, 2025
అల్లూరి: కిలో చికెన్ రూ.260

అల్లూరి జిల్లాలో పలు ప్రాంతాల్లో బ్రాయిలర్ చికెన్ స్కిన్‌తో కిలో రూ.260కాగా, స్కిన్ లెస్ రూ.280 ఉంది. ఈ ధర రాజవొమ్మంగి, కొయ్యూరు, చింతపల్లి, రంపచోడవరం మండలాల్లో ఉంది. పాడేరు, ముంచింగిపుట్టు తదితర మండలాల్లో రూ.300 వరకు విక్రయిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. గత వారం కంటే రూ.20 పెరిగిందన్నారు. రాజమండ్రి, నర్సీపట్నం, అనకాపల్లి నుంచి కోళ్లు జిల్లాకి వస్తాయని వ్యాపారులు చెప్పారు.
News December 21, 2025
WGL: భద్రకాళి అమ్మవారి నేటి దర్శనం

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News December 21, 2025
ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుడి సస్పెండ్.!

పాఠశాల రికార్డుల్లో విద్యార్థుల సంఖ్య తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. సంతనూతలపాడు మండలం మంగమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు విధుల్లో ఉండగా.. ఇటీవల RJD పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో విద్యార్థుల సంఖ్య రికార్డుల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కాగా RJD వివరణతో అతణ్ని సస్పెండ్ చేసినట్లు DEO తెలిపారు.


