News March 6, 2025
జగిత్యాల: మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి: అడిషనల్ కలెక్టర్

ఈనెల 17 లోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో యాసంగి 2023-24 కు సంబంధించి సీఎంఆర్ చెల్లింపులపై బాయిల్డ్ రైస్ మిల్లర్లతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బకాయిలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, మేనేజర్, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ మండలం చర్లపల్లిలోని హాకా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీల కొరత లేకుండా సకాలంలో వాటిని వెంటవెంటనే పంపించాలని పేర్కొన్నారు.
News November 6, 2025
కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కోయంబత్తూరు <<18187183>>గ్యాంగ్ రేప్<<>> బాధితురాలిపై DMK మిత్రపక్ష MLA ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాత్రి 11.30గం.కు మహిళ, పురుషుడు చీకట్లో ఉండటం వల్ల కలిగే అనర్థాలను ఆపేదెలాగని అన్నారు. వీటిని పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేవని చెప్పారు. పేరెంట్స్ పెంపకం, టీచర్లతోనే మార్పు వస్తుందని పేర్కొన్నారు. దీంతో నిందితులను ఒక్కమాట అనకుండా బాధితురాలిని తప్పుబట్టడమేంటని BJP నేత అన్నామలై మండిపడ్డారు.
News November 6, 2025
MBNR: 42% రిజర్వేషన్ కోసం బీసీ JAC మౌన ప్రదర్శన

జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం జ్యోతిబా పూలే విగ్రహం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ నాయకులు బెక్కం జనార్దన్ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు, వివిధ సంఘాలకు జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


