News November 30, 2025

జగిత్యాల: ముగిసిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 రోజులుగా జరుగుతున్న వైజ్ఞానిక ప్రదర్శన శనివారంతో ముగిసింది. ఈ ప్రదర్శనలో 450 మంది విద్యార్థులు తమ నూతన ఆవిష్కరణలు ప్రదర్శించారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న 350 ఎగ్జిబిట్స్ కు 7 ఉప అంశాలకు జిల్లా నుండి రాష్ట్రస్థాయికి జూనియర్ విభాగంలో ఏడు, సీనియర్ విభాగంలో ఏడు,111 ఇన్స్పైర్ ప్రదర్శనలకు 11 ఎంపికయ్యాయి. డీఈఓ రాము తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 3, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤కోటబొమ్మాళిలో జేసీ ఆకస్మిక తనిఖీ
➤పాతపట్నం: లగేజీ ఆటో బోల్తా.. బాలుడికి గాయాలు
➤మనుషుల నుండి Scrub Typhus వ్యాపించదు: DMHO
➤శ్రీకాకుళం: ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం వద్దు
➤రైతుసేవలో కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే బగ్గు
➤మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే శిరీష
➤మందస: నరకాన్ని తలపిస్తున్న రహదారులు

News December 3, 2025

తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు

image

అయ్యప్ప మాల ధరించిన స్వాములకు టీజీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. ఈనెల 17న తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వి.పద్మావతి తెలిపారు. ఈ బస్సు శ్రీశైలం, మహానంది, అహోబిలం, పళని, గురువాయూర్, అయ్యప్ప సన్నిధానం, త్రివేండ్రం, రామేశ్వరం, మధురై, శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ వెళ్తుందని బుధవారం ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.

News December 3, 2025

దేవరకొండ: బురఖా ధరించి వృద్ధురాలిపై రోకలితో దాడి

image

దేవరకొండ, గాంధీనగర్‌లో బురఖా ధరించి ఇంట్లోకి ప్రవేశించిన ఓ మహిళ వృద్ధురాలు కొండోజు భాగ్యమ్మపై రోకలితో దారుణంగా దాడి చేసింది. కోడలి స్నేహితురాలినని చెప్పి లోపలికి వచ్చి క్రూరంగా కొట్టింది. కేకలు విని స్థానికులు రాగా, ఆమె పారిపోయింది. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల క్రితం ఇంట్లోంచి మాయమైన రోకలితోనే దాడి జరగడం సంచలనం సృష్టించింది.