News February 6, 2026

జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

image

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆర్ఓలు ఏఆర్ఓలు, కౌంటింగ్ అధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు. నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియల్లో ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.

Similar News

News February 6, 2026

వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం

image

వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. వేములవాడలో ఎన్నికల జోనల్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె సందర్శించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎస్‌ఈసీ కరదీపిక వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికల విధులలో ఉండే అధికారులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలన్నారు.

News February 6, 2026

బీఆర్ఎస్ హయంలోనే భూములకు ధరలు పెరిగాయి: కేటీఆర్

image

బీఆర్ఎస్ హయంలోనే భూముల ధరలు పెరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దూరు బాబాజీ కాలనీలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో పోలీస్ బెటాలియన్, వ్యవసాయ కళాశాల, ఆప్రల్ పార్కు తదితర నిర్మాణాలన్నీ కేసీఆర్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. ఎట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడు ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

News February 6, 2026

NZB: రూ.90.96 కోట్లతో TUలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

image

తెలంగాణ యూనివర్సిటీలో రూ.90.96 కోట్లతో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. వీటిలో రూ.43 కోట్లతో ఆడిటోరియం, అడ్మిన్ బిల్డింగ్, CSC భవన విస్తరణ పనులు, రూ.8.60 కోట్లతో నిర్మించనున్న బాలికల హాస్టల్, రూ.1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు, రూ.18 కోట్ల సైన్స్ ల్యాబ్ ఉన్నాయి. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు.