News December 10, 2025
జగిత్యాల మెడికల్ కాలేజీని సందర్శించిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బుధవారం సందర్శించారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే విజన్‌తోనే కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ 33 మెడికల్ కాలేజీల రాష్ట్రంగా మార్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మెడికల్ కాలేజీలో సదుపాయాల కల్పనలో విఫలమైందన్నారు.
Similar News
News December 11, 2025
జమ్మికుంట: భారీగా పడిపోయిన విక్రయాలు!

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు భారీగా పడిపోయాయి. నిన్నటి వరకు 400 పైగా క్వింటాల పత్తి అమ్మకానికి రాగా నేడు 240కే పరిమితమయ్యాయి. గురువారం యార్డుకు 240 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.7,300 ధర లభించిందని మార్కెట్ అధికారులు తెలిపారు. తాజాగా పత్తి ధర నిన్నటి లాగానే నిలకడగా కొనసాగింది.
News December 11, 2025
ఇంత గందరగోళానికి ఇండిగోనే కారణం: రామ్మోహన్

ఇండిగో విమాన సేవలు తిరిగి గాడిలో పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తలెత్తిన సంక్షోభానికి ఆ సంస్థ ‘మిస్ మేనేజ్మెంట్’ మాత్రమే కారణమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘వారి అంతర్గత సిబ్బంది రోస్టరింగ్ వ్యవస్థలో కొంత గందరగోళం నెలకొంది. FDTL మార్గదర్శకాల ప్రకారం కొత్త నిబంధనలకు అనుగుణంగా దానిని నివారించి ఉండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు’ అని తెలిపారు.
News December 11, 2025
పెద్దపల్లి: ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 21న పెద్దపల్లి జిల్లాలోని అన్ని కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా లోక్ అదాలత్ పోస్టర్లను ఆవిష్కరించారు. కక్షిదారులు తప్పనిసరిగా తమ తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి.భవానీ ఉన్నారు.


