News December 27, 2025

జగిత్యాల: మొన్నే పోస్టింగ్.. ఇంతలోనే గుండెపోటుతో మృతి

image

జగిత్యాల జిల్లా వైద్యాధికారి(DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 4:30 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇటీవలే జిల్లా వైద్యాధికారిగా నియమితులైన శ్రీనివాస్ మృతి చెందడంతో వైద్య వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.

Similar News

News December 29, 2025

గద్వాల: గ్రీవెన్స్ డేకు 20 ఫిర్యాదులు- ఎస్పీ శ్రీనివాసరావు

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కు 20 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భూ వివాదాలకు సంబంధించి 10, గొడవలకు సంబంధించి 2, భార్యాభర్తల తగాదా 1, ఇతర అంశాలకు సంబంధించి 7 మొత్తం 20 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.

News December 29, 2025

రాయచోటి ప్రజలకు క్షమాపణలు: మంత్రి రాంప్రసాద్

image

AP: రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడంతో <<18702293>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశంపై తొలిసారి స్పందించారు. స్థానిక ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాయచోటి ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టబోనని స్పష్టం చేశారు. ప్రజలు ఏడాదిలో ఈ బాధ నుంచి బయటపడేలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడనని, విమర్శలకు సరైన రీతిలో సమాధానం ఇస్తానన్నారు.

News December 29, 2025

KNR: మహిళా కూలీలతో అసభ్య ప్రవర్తన.. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు

image

మానకొండూరు మండలం పచ్చునూరులో ఉపాధి హామీ మహిళా కూలీలతో అసభ్యంగా ప్రవర్తించిన ఫీల్డ్ అసిస్టెంట్ కురాకుల పోచాలును విధుల్లో నుంచి తొలగిస్తూ DRDO ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ సస్పెండై వివాదాస్పదుడైన వ్యక్తిని అధికారులు తిరిగి విధుల్లోకి ఎలా తీసుకున్నారో వారికే తెలియాలని గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.