News February 17, 2025
జగిత్యాల: యువకుడి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన యువకుడు మంతెన ప్రవీణ్(19) సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లారని, ప్రవీణ్ ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడని చెప్పారు. ఈ క్రమంలో ప్రవీణ్ సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. అతడి ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉందన్నారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News September 15, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ
☞ కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణాలో13 మంది ఎంపీడీవోలకి పదోన్నతి
☞ కృష్ణాలో ఇంటి స్థలాల కోసం 19,382 దరఖాస్తులు
☞ వాట్సాప్‌లో కనకదుర్గమ్మ అర్జిత సేవ టికెట్లు
☞ కురుమద్దాలి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు
News September 15, 2025
NRPT: ‘ANMలను NCD ఆన్‌లైన్ ప్రోగ్రామ్ నుంచి తొలగించాలి’

ఎన్‌సీడీ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ నుంచి ఏఎన్ఎం (ANM)లను తొలగించాలని కోరుతూ సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు ఏఎన్‌ఎంలు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ప్రోగ్రామ్ వల్ల ఏఎన్‌ఎంలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజుకు 12 గంటల సమయం దీనికే సరిపోతోందని తెలిపారు. దీనివల్ల ఒత్తిడికి గురై అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
News September 15, 2025
NRPT: ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్ష

ఎలక్టర్ మ్యాపింగ్ టేబుల్‌ను పకడ్బందీగా తయారు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహశీల్దార్లకు సూచించారు. త్వరలో భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్.ఐ.ఆర్ షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో బీఎల్వోలు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన ఉన్న చోట వారికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.