News February 24, 2025

జగిత్యాల: యూరియా కోసం రైతుల ఇబ్బందులు

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంటకు చివరి దశలో యూరియా చల్లడానికి రైతులకు బస్తాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అరకొరగా వస్తున్న యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద కాపలా కాస్తున్నారు. సోమవారం జగిత్యాల, మల్లాపూర్‌కు యూరియా రాగా రైతులు అధికసంఖ్యలో రావడంతో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు.

Similar News

News February 24, 2025

విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

image

AP: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం నెలకొంది. గోశాల వద్ద విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రైతుతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నట్లు సమాచారం

News February 24, 2025

AP మిర్చికి కేంద్రం మద్దతు ధర

image

AP: మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద ఏపీ మిర్చికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ధర లేదంటూ ఏపీలో రైతులు ఆందోళన చేయగా, సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి దీనిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేంద్రం మద్దతు ధరపై ఈ ప్రకటన చేసింది. తొలి క్వింటా మిర్చి సేకరణ నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.

News February 24, 2025

లింగాల మండలంలో దారుణ హత్య

image

లింగాల మండలంలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. దిగువపల్లి గ్రామంలో పప్పూరు గంగిరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం దారుణంగా హత్య చేశారు. పొలం పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన గంగిరెడ్డిని వేట కొడవల్లతో నరికి హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!